భట్టి విక్రమార్క సీఎల్పీ నేత
మోదీ ఒక కేడి… కేసీఆర్ కూడా ఒక కేడీ. నల్ల చట్టాలి వెనక్కు తీసుకునే దాకా కాంగ్రెస్ పోరాటం ఆగదు. రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి పదవిని ఎడమకాలి చెప్పుతో పోల్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఏ చెప్పుతో కొట్టాలని ప్రశ్నించారు భట్టి. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిన ప్రధాని మోదీ.. ఒక కేడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు ఆదిలాబాద్ జిల్లాలోని భీంసరి గ్రామంలో ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సమయంలోనే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీపై ఎప్పుడూ లేనంతగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
భీంసరిలో జరిగిన రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, శ్రీమతి గండ్రత్ సుజాత, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.