దేశంలోని సమస్యలపై కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విపక్షాలు నిత్యం విమర్శలు గుప్పిస్తోనే ఉంటాయి. అయితే, ఇటీవల కాలంలో ఈ విమర్శలు సోషల్ మీడియా వేదికగా కాసా ఎక్కువగానే చేస్తున్నారు. చెప్పాలంటే బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య సోషల్ మీడియాలో యుద్ధమే జరుగుతోంది.
కాంగ్రెస్ అధికారంలో ఏం అభివృద్ధి చేయలేదని బీజేపీ అంటే.. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. అయితే, తాజాగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. బీజేపీ ప్రభుత్వంలో ఆకలి కేకలు పెరిగాయని ఆరోపించింది. ఇందుకు శనివారం విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్(ప్రపంచ ఆకలి సూచిక)ను కాంగ్రెస్ ప్రస్తావించింది.
ఈ సూచికలో 116 దేశాలు ఉంటే.. భారత్ 101వ స్థానంలో నిలిచింది. 101వ స్థానంలో దేశం ఉందంటే.. దేశంలోని ప్రజలు ఏ మేర ఆకలిలో కూరుకుపోతున్నారో ఇట్టే అర్థం అవుతోందని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు బీజేపీ సర్కారు ఏమీ చేయడం లేదని కూడా నిందించింది. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? అంటూ కూడా దేశ ప్రజలను ప్రశ్నించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఓ పోస్ట్‌ను పెట్టింది.
‘ దేశం ఆకలితో బాధపడుతుంటే.. ప్రభుత్వం మాత్రం తక్కువ సహాయం చేస్తోంది. తమ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా.. పట్టించుకోని ఉదాసీన ప్రభుత్వం, దేశ ప్రయోజనాలను కూడా పట్టించుకోదు’ అంటూ ట్విట్ చేసింది.
A country suffering from hunger; a government doing little to help.
An apathetic government that does not not care about its people going hungry, does not hold the country’s best interest. pic.twitter.com/HOQdhasqpe
— Congress (@INCIndia) March 26, 2022
Advertisements