దాసోజు శ్రవణ్
సాక్షాత్తు భారత ప్రధాని బీసీ నాయకుడుగా ఉన్నప్పటికీ అంగట్లో అన్నీ ఉన్న అల్లుడినోట్లో శని అన్న చందంగా దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో బీసీ బిడ్డల నోట్లో మన్ను కొడుతున్నారు.బిసి లకు రాజ్యాంగ బద్దంగా అమలు కావాల్సిన 27 శాతాన్ని అమలు కాకుండా అడ్డుపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో గల ఇఫ్లూ లో కుట్ర పూరితంగా బీసీ లకు అధ్యాపక పోస్టులు దక్కకుండా చేస్తుండడం తో కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ బీసీ కమిషన్ కు వినతిపత్రం ఇవ్వగా గత నెల 25 న బీసీ కమీషన్ సభ్యులు తల్లోజి ఆచారి ఎదుట ఇఫ్లూ అధికారులు హాజరైనపుడు వారు స్పష్టంగా నోటిఫికేషన్,ఇంటర్వ్యూ లు రద్దు చేసి పూర్తీ వివరాలతో ఈ నెల 2వ తేదీన హాజరుకావాల్సిఉండగా ఇఫ్లూ ఉపకులపతి భేషజాలకు పోయి హాజరుకాకుండా బిసి లకు అన్యాయం చేయడానికి కంకణం కట్టుకున్నారు.
తప్పుడు నోటిఫికేషన్ లు రద్దు చేసి వెంటనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసి బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలి. ఇఫ్లూ లో 236 ఉన్న ఉద్యోగాల్లో 27 శాతం ప్రకారంగా బీసీ లకు 63 ఉద్యోగాలు దక్కాల్సి ఉండగా ఇన్నేళ్ళుగా 23 పోస్టులే దక్కాయి. ప్రస్తుత నోటిఫికేషన్ లో కూడా బీసీ లకు మొండి చేయి చూపారు.
భేషజాలకుపోయి ఇఫ్లూ ఉపకులపతి రెండవ తేదీన హాజరుకాలేదు. స్వయంగా బీసీ కమిషన్ చైర్మన్ భగవాన్ లాల్ సైని 5వ తేదీన హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఇఫ్లూ కులపతి హాజరై నోటిఫికేషన్ రద్దుచేసి బీసీలకు అందరం కలిసి న్యాయం చేద్దాం..లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ లు తమ సొంత జాగీరుల్లా కాకుండా యూజీసీ నియమనిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి.
కాంగ్రెస్ పార్టీ బీసీ లకు రిజర్వేషన్ లు కల్పించిన పార్టీ గా కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడతాం. జాతీయ స్థాయిలో అన్ని విద్యాసంస్థల్లో రిజర్వేషన్ ను సాధించేవరకు పోరాటం ఆపబోము.