దాసోజు శ్రవణ్ టీపీసీసీ అధికార ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం లో బీసీ కమిషన్ కాలపరిమితి గత అక్టోబర్ 26 2019 వ సంవత్సరమే ముగిసినప్పటికీ ఇంతవరకు పునరుద్దరించలేదు. రాజ్యాంగ బద్దమైన ఈ కమిషన్ ను పునరుద్ధరించడం లో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందో అంతుచిక్కడం లేదు. దేశం లో కేవలం తెలంగాణ రాష్ట్రం లో మాత్రమే రాజ్యాంగ సవరణలను బేఖాతరు చేస్తూ కమిషన్ లను రాజ్యాంగ బద్దమైన అధికారాలు కల్పించకుండా నామమాత్రంగా గత కమిషన్ ను ఏర్పాటు చేసి అధికారాలు కల్పించకుండా బీసీ లకు అన్యాయం చేసారు.కేంద్రం చేపట్టిన 2017 -123రాజ్యాంగసవరణ ,2018 -102రాజ్యాంగ సవరణలను మన పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్,తమిళ నాడు,కర్ణాటక రాష్ట్రాలు చట్టాలుగా చేసుకొని బీసీ కమిషన్ లకు సర్వాధికారాలాతో రాజ్యాంగ బద్దమైన కమిషన్ ఏర్పాటు చేసుకొని బీసీ వర్గాలకు అండగా ఉంటున్నాయి. కేవలం తెలంగాణా రాష్ట్రం లో మాత్రం రాజ్యాంగ సవరణలు అమలుపరచకుండా గత పదహారు నెలల కింద కాలపరిమితి ముగిసిన కమిషన్ ను ఇంకా పునరుద్దరించలేదంటే కెసిఆర్ ప్రభుత్వానికి బీసీ లపై ఏపాటి ప్రేమ ఉందో అర్థమౌతుందన్నారు.
రాష్ట్రం లో బీసీ కమిషన్ లేక బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇఫ్లూ,హెచ్ సి యూ లాంటి యూనివర్సిటీలోని నియామకాల్లో పిహెచ్ డి లాంటి ప్రవేశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. నల్సార్ యూనివర్సిటీ లోని ఎల్ ఎల్ బి ప్రవేశాల్లో కూడా ఇదే అన్యాయం బీసీ లకు ఎదురౌతుంది. బీసీ కమిషన్ లేకపోవడంవల్ల బీసీ లు తమకు జరుగుతున్న అన్యాయాలను చెప్పుకోడానికి సరైనవేదిక దొరకక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. వీరివేదన అరణ్యరోదనగానే మిగిలిపోతుంది. వెనకపడ్డ కులాల వారికి రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన హక్కులు కోల్పుతున్నారు. బీసీ ల రాజ్యాంగ హక్కులు కాపాడడానికి సరైన వేదిక అవసరం. రాష్ట్రం లో బీసీ లకు రాజ్యాంగ బద్దమైన కమిషన్ లేకపోవడం వల్ల విచ్చలవిడిగా వివిధ సంస్థల్లో వివిధ స్థాయిల్లో తీరని అన్యాయం జరుగుతోంది.
కాళోజి హెల్త్ యూనివర్సిటీ లోని వైద్యవిద్య ప్రవేశాల్లోను,ఇఫ్లూ యూనివర్సిటీ,యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్,మౌలానా ఆజాద్ నిషినల్ ఉర్దూ యూనివర్సిటీ లోను నల్సార్ లాంటి పలు యూనివర్సిటీల్లోనూ బీసీలకి మొండిచెయ్యే ఎదురౌతుంది. రాబోయే బడ్జెట్ సమావేశల్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి రాజ్యాంగ బద్దమైన బీసీ కమిషన్ ను ఏర్పాటుకు కృషిచేయాలి, వెంటనే కమిషన్ ను ఏర్పాటు చేసి చైర్మన్ ,సభ్యుల నియామకాన్ని పూర్తిచేయాలి. బీసీ కమిషన్ చైర్మన్ అనేది రాజకీయ పునరావాస కొరకు కాకుండా నిబద్దతతో బీసీ వర్గాల అభ్యున్నతికి కృషిచేసి వారిని నియమించాలి.