దాసోజు శ్రవణ్
తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దు. కేసీఆర్, కేటీఆర్ లు ఓటర్లను మోసం చేసేందుకు మళ్ళీ కుట్ర చేస్తున్నారు.గతంలో కేసీఆర్ కుక్క తోకను ఊపుతాదా.. తోకను కుక్కను ఊపుతాదా అని అన్నారు.ఇప్పుడు అదే కేసీఆర్ ఓట్ల కోసం ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. మోసపోవద్దు..ఇప్పటికైనా గొర్రెల్లా మోసపోవద్దు.. కొంతమంది నాయకులు పాల ప్యాకెట్లు, పాటకులు జేబులో పెట్టుకొని తిరుగుతితున్నారు.
టిఆర్ఎస్ ను ఓడిస్తే మీ హక్కులు, మీ జీతాలు ఇంటికి వస్తాయి. పీఆర్సీ కేసీఆర్ ఇచ్చే బిక్ష కాదు. అది సహజంగా జరిగే ప్రక్రియ.. అది ఉద్యోగుల హక్కు.. ఆంధ్రప్రదేశ్ 27 శాతం ఇస్తే 29 శాతం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని అందుకు పాల ప్యాకెట్లు, పాటకులు బ్యాచ్ సంబరాలు చేయడం మోసం కాదా.. గతంలో 43 శాతం ఇచ్చామని ఇప్పుడు 45 శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు సంఘాల నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదు.
ఇప్పటికైనా కేసీఆర్ 45 శాతం ఫిట్మెంట్ ఇస్తామని చెప్పి ఉద్యోగుల అన్ని రకాల సమస్యల పరిష్కారాలు చేస్తే తాము ఎన్నికల నుంచి తప్పుకుంటాం. ఎన్నికలు రాగానే కేసీఆర్ కు అబద్దాలు వస్తాయి. గతంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. జిహెచ్ఎంసి ఎన్నికలలో వరద బాధితులకు 10 వేల సహాయం ఇస్తామన్నారు. ఇంటింటికి తాగు నీరు ఉచితంగా ఇస్తామన్నారు. అవన్నీ మర్చిపోయారు.. అల్జీమర్స్ రోగిలా కేసీఆర్ మారిపోయారు.కేటీఆర్ హైదరాబాద్ లో మంచి నీళ్ళు కోసం కొట్లాడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కృష్ణ, గోదావరి నదుల నుంచి పుష్కలంగా నీరు అందించి దాహార్తి తీర్చింది కాంగ్రెస్ పాలకులు. విద్యుత్ ఉద్యోగులను పర్మనెంట్ చేసినట్టు కేటీఆర్ అబద్దాలు చెప్తున్నారు. తమకు పర్మనెంట్ కాలేదని ఇప్పటికే ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కేటీఆర్ ఇంత పచ్చి అబద్దాలు ఆడుతూ మోసం చేస్తున్నారు. మండలి ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులను ఓడిస్తే వాళ్ళ ప్రభుత్వం ఏమి పడిపోదు. కానీ ఓడిస్తే కేసీఆర్, కేటీఆర్ ల అబద్దాలు మాని ప్రజలకు ప్రధానంగా నిరుద్యోగులకు, గ్రాడ్యుయేట్లకు న్యాయం జరుగుతుంది. కేటీఆర్ మాటలు..ఇంటి పేరు శ్రీగంధం వారు ఇంట్లో గబ్బిలాల వాసన అన్నట్టుగా ఉంది. ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి అనుబంధ సంఘంగా మారిపోయింది. రెండు రోజుల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు బోగస్ ఓట్లపైన విచారణకు ఆదేశాలు ఇచ్చారు. రెండు రోజుల్లో ఏమి విచారణ జరుపుతారు. ఏ చర్యలు తీసుకుంటారు.ఒకసారి కాంగ్రెస్ కు అవకాశమిచ్చి చూడండి ఎలా ప్రశ్నిస్తారో ఎలా మీ సమస్యలు పరిష్కారమిస్తారో చూడండి.