రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ
ఇంద్రవెల్లిలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ నేతలకు పిచ్చి పట్టింది. సభకు హాజరైన జనాన్ని చూసి టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గులాబీ నేతలు రేవంత్ రెడ్డిపైన మొరుగుతున్నారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ దళిత, గిరిజనులను మోసం చేస్తున్నారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని ఉన్నా నెరవేర్చలేదు. దళితులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయలేదు.
దళిత, గిరిజన బంధు పెట్టి రాష్ట్రమంతా అమలు చేయాలి. కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై.. టీఆర్ఎస్ నాయకులు అవాకులు, చెవాకులు మాట్లాడితే అంతకుమించి బదులిస్తాం.