కాంగ్రెస్ సీనీయర్ నేత గులాంనబీ ఆజాద్ పై మాజీ ఎంపీ వీహెచ్ మండిపడ్డారు. పార్టీపై ఆజాద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. 1992లో ఏం చేశావో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో జనార్ధన్ రెడ్డి తర్వాత సీఎం అభ్యర్థిగా ఉన్న నన్ను దెబ్బ కొట్టావంటూ మండిపడ్డారు. ఇందిరాగాంధీ లేనిది నువ్వు ఎక్కడ నుండి వచ్చావని, 40 సంవత్సరాల్లో ఏ ఒక్కనాడు కూడా పదవి లేకుండా లేవన్నారు. సాధారణ స్థాయి నుండి నిన్ను పార్టీ జమ్మూ కాశ్మీర్ కు సీఎంను చేసిందని గుర్తు చేశారు.
ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉంటే రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా ఉండి పార్టీకి వ్యతిరేకంగా ఎలా లేఖ రాస్తారని వీహెచ్ ఆజాద్ ను ప్రశ్నించారు. పార్టీకి అండగా ఉండాల్సింది పోయి వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం మంచిది కాదన్నారు. ఇందిరమ్మ దయతో నీకు అనేక పదవులు దక్కాయని, ఆ తర్వాత సోనియా, శరద్ పవార్ లు నీకు అండగా నిలిచారని గుర్తు చేశారు.