కర్ణాకలో ఈ రోజు మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నారు. 24 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. దీంతో కేబినెట్ లో మంత్రుల సంఖ్య 34కు చేరుతుంది. నూతన ప్రభుత్వం కొలువు దీరిన వారం రోజుల్లోనే మంత్రి వర్గ విస్తరణ చేపడుతుండటం గమనార్హం.
నూతన మంత్రులుగా ప్రమాణం చేయబోతున్న వారిలో ఎమ్మెల్యేలు హెచ్ కే పాటిల్, కృష్ణ బైరగౌడ, చెలువ రాయ స్వామి, కే వెంకటేశ్, హెచ్ సీ మహదేవప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే, కర్ణాటక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దినేశ్ గుండు రావు, ఇతరులు ఉన్నారు.
వీరితో పాటు ఎన్ రాజన్న, శరణ బసప్ప, దర్శన్ పూర్, శివానంద్ పాటిల్, రామప్ప బాలప్ప తిమ్మాపూర్, ఎస్ఎస్ మల్లిఖార్జున్, శివరాజ్ సంగప్ప తంగడగి, శరణ్ ప్రకాశ్ రుద్రప్ప పాటిల్, మంకాల్ వైద్య, లక్ష్మీ హెబ్బాల్కర్, రహిమ్ ఖాన్, డీ సుధాకర్, సంతోష్ లాడ్, ఎన్ ఎస్ బోసే రాజు, సురేశ మధు బంగారప్ప మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
నూతనంగా మంత్రి వర్గంలో స్థానం పొందిన వారిలో ఆరుగురు లింగాయత్ సామాజిక వర్గానికి, నలుగురు వొక్కలిగా సామాజిక వర్గానికి, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ, ఐదుగురు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు వున్నారు. ఇక బ్రాహ్మణ వర్గం నుంచి దినేశ్ గుండు రావుకు కేబినెట్ లో చోటు దక్కింది.