ప్రభుత్వ నిర్ణయాలను, ప్రభుత్వాధినేతల తప్పులను ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్, కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారని… అంత మాత్రాన రేవంత్ ఇంటి పైకి కార్యకర్తలను ఉసిగొల్పటమేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది.
విమర్శించిన నేతల ఇండ్లపై దాడులు చేసేందుకు రావటం ఇదేక్కడి రాజకీయమని, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటించకపోతే ఏం చేసేవారో అని మండిపడుతున్నారు. నిరసన తెలపాలనుకుంటే మరో చోట తెలపాలి, దిష్టిబొమ్మ దగ్ధం చేయాలనుకుంటే మరో చోట చేసుకోవాలి… అంతేకానీ సదరు నేత ఇంటి వద్దకే రావటం గతంలో ఎప్పుడూ లేదని, ఇటీవల మీటింగ్ లో కేటీఆర్ ఇదే మీకు చెప్పి ప్రొత్సహించారా అని ప్రశ్నిస్తున్నారు.
మాపై విమర్శలకు ఇక ఊరుకోం… తగిన విధంగా సమాధానం చెప్తాం అంటూ కేటీఆర్ చెప్పిన తర్వాతే ఈ దాడికి ప్రయత్నం చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.