బాలీవుడ్ నటి దీపికా పడుకొనే ఢిల్లీలోని జె.ఎన్.యు కెళ్లి దాడికి గురైన విద్యార్ధులను పరామర్శించడంపై బీజేపీ చేస్తోన్న విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. దీపికా తన ఫిల్మ్ ‘చపక్’ ప్రొమోషన్ లో భాగంగా జె.ఎన్.యు వెళ్లిందని బీజేపీ అనడంపై కాంగ్రెస్ స్పందిస్తూ జె.ఎన్.యు కు వెళ్లకపోతే…నాగపూర్ (ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్) వెళ్లాలా అని ప్రశ్నించింది.
ఒక నటి మనిషిగా స్పందించి…విద్యార్ధులపై దాడికి నిరసన తెలపడానికి వెళ్తే ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్లు…సోషల్ మీడియాలో ప్రచారం…ఆమె సినిమాను బహిష్కరించడం…ఇదీ మన ప్రభుత్వం తీరు. ఈ స్థాయికి దిగజారింది. సినిమా ప్రమోషన్ కోసం సంఘ్ ముఖ్యాలయం నాగ్ పూర్ వెళ్లాలా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా జె.ఎన్.యు కు వెళ్లి ఆవేదనలో ఉన్న యువతతో మాట్లాడతారనుకున్నాం..కానీ అక్కడికి వెళ్లిన దీపికా పడుకొనేకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారన్నారు.
దీపికా పడుకొనే మంగళవారం సాయంత్రం జె.ఎన్.యు వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వారికి మద్దతు తెలిపారు. దీపికా పడుకొనే జె.ఎన్.యు వెళ్లడంపై సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది. కొందరు సపోర్ట్ దీపిక యాష్ ట్యాగ్ తో దీపికను సమర్ధిస్తుంటే… మరికొందరు బైకాట్ చపక్ యాష్ ట్యాగ్ తో దీపికను విమర్శిస్తున్నారు.