ఇందిరా శోభన్ టీపీసీసీ అధికార ప్రతినిధి
విద్యారంగంలో ఓబీసీ విద్యార్థులకు అన్యాయం జరగట్లేదా…ఉద్యోగ అవకాశాల్లోనూ అదే తీరు..ఓబీసీలను అణగదొక్కేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల కుట్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులతో సంబంధం లేకుండా వెనుకబడిన వర్గాల ఓబీసీ విద్యార్థినీ, విద్యార్థులందరికీ ఉపకారవేతనాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఎంసెట్ లో 10వేల లోపు ర్యాంకు సాధించిన ఓబీసీ విద్యార్థులకు మాత్రమే స్కాలర్ షిప్ ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పెట్టిన నిబంధనను తప్పు. ఇన్నాళ్లు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఓబీసీ స్టూడెంట్స్ ను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు కేసీఆర్ సర్కార్ కుట్ర పన్నుతున్నట్లు కనబడుతోంది.
అటు.. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు, నీట్, న్యాయ విద్యాసంస్థల్లోనూ ఓబీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఫీజుల విషయంలో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ఓబీసీ విద్యార్థులను పరిగణించాలి. అలాగే.. తెలంగాణలో విద్యారంగం, ఉద్యోగ అంశాల్లో తమిళనాడు తరహా పూర్తి స్థాయి బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు పరచాలి. ఈ మేరకు.. ఇదే అంశాలపై తనవంతు చొరవ చూపాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోషియేషన్ కు ఓ వినతిపత్రం ఇచ్చాను. దీనిపై సానుకూలంగా స్పందించిన వారు తప్పకుండా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.