వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్ముక్కై రైతుల ఉసురు పంచుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరుగుతోందన్నారు. గోదాముల్లో మిస్ అయిన బియ్యం ఎక్కడికి పోయాయో సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు.
ఆఖరి గింజ కొనే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. టీఆర్ఎస్ నాయకులు వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు కోదండరెడ్డి. వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని.. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులను ఇబ్బంది పెడితే పుట్టగతులుండవని హెచ్చరించారు కోదండరెడ్డి.