పుష్ఫ మేనియా ఏ రేంజ్ లో ఉందో చూస్తున్నాం.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తగ్గేదేలే డైలాగ్.. శ్రీవల్లి సాంగ్ ఓ ఊపు ఊపేస్తున్నాయి. పిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా వీడియోలు చేస్తూ నెట్టింట పెట్టేస్తున్నారు. ఆఖరికి సెలెబ్రిటీలు సైతం పుష్పను ఇమిటేడ్ చేస్తున్నారు.
విదేశీ క్రికెటర్లకు సైతం పుష్ప తెగ నచ్చేశాడు. వికెట్ పడడం ఆలస్యం తగ్గేదే లే అంటూ డైలాగ్స్ చెబుతున్నారు.. శ్రీవల్లి సాంగ్ స్టెపులు వేస్తున్నారు బౌలర్స్. ఇటు పుష్ప మేనియా రాజకీయాలను కూడా టచ్ చేసింది.
ఇంకొన్ని రోజుల్లో యూపీకి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారంలో పార్టీలు యమ స్పీడ్ మీదున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అందులో పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ ట్యూన్ వాడేసింది.
”తూ హై గజాబ్ యూ యూపీ.. తేరీ కసమ్ యూపీ(చాలా అందంగా ఉంటావు యూపీ..)” అంటూ సాగే వీడియో సాంగ్ ను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఉత్తరప్రదేశ్ వాసులం అయినందుకు గర్వంగా ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
శ్రీవల్లి సాంగ్ తో కాంగ్రెస్ పార్టీ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకుముందు బాహుబలి డైలాగ్స్, పాటలను తెగ వాడేశాయి పార్టీలు. ప్రధాని మోడీ సైతం బహిరంగ సభల్లో ఉదాహరణగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పుష్ప వంతు వచ్చింది.
పుష్ప హిందీ వెర్షన్ నార్త్ లో సూపర్ హిట్ అయింది. నిర్మాతలకు కాసులవర్షం కురిపించింది. బన్నీ రేంజ్ ను కూడా అక్కడ అమాంతం పెంచేసింది.
यूपी वाला होने पर गर्व है।#सुप्रभातUP pic.twitter.com/WuSxv9o67a
— UP Congress (@INCUttarPradesh) February 4, 2022
Advertisements