హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సీనియర్ నేత అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. గ్రేటర్ ఓటమి అపనింద మోయడం తనకు ఇష్టం లేదన్న ఆయన.. ప్రమోషన్ కోసమే రాజీనామా చేసినట్టు చెప్పారు. బీసీ కోటాలో పీసీసీ అధ్యక్ష పదవి కోరుకుంటున్నానని.. అందుకే నగర అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేసి.. పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు గ్రేటర్ ఎన్నికల సీట్ల కేటాయింపులో తన ప్రమేయం ఏమీ లేదన్నారు అంజన్ కుమార్. తాను సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాలను మాత్రమే చూసినట్టు చెప్పారు. పార్టీ మారే విషయంపై స్పందిస్తూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను బీజేపీలోకి వెళ్లనని స్పష్టం చేశారు.