‘మన ఊరు- మన బడి’పథకంలో అక్రమాలపై కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ కేంద్ర రెవెన్యూలో ఫిర్యాదు చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 2022 బడ్జెట్‌లో రూ.7,289 కోట్లు కేటాయించిందని ఆయన ఫిర్యాదులో తెలిపారు.
మొదటి దశలో భాగంగా 9,123 పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,497 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనికి ఎంఎన్‌ఆర్‌జీఏ నిధులు కూడా మళ్లీంచారని ఆయన ఆరోపణలు చేశారు.
ఈ టెండర్లను పరోక్షంగా మేఘా కంపెనీ ఇచ్చేందుకు ప్రయత్నింగా హైకోర్టు నేపథ్యంలో ఆ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. దానిపై ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఈ కార్యక్రమంలో విస్తృత పాత్ర పోషిస్తున్న పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేనపై కూడా దర్యాప్తు జరపాలని ఆయన కోరారు.
పలు చోట్ల ఈ పథకం కోసం ఎంన్ఆర్‌జీఏ నిధులను మళ్లించినట్టు ఆయన ఆరోపించారు. భారత ప్రభుత్వం నుండి విడుదలైన నిధుల కోసం యుటిలైజేషన్ సర్టిఫికేట్‌లను కోరాలని తాను కేంద్ర రెవిన్యూ శాఖను అడిగినట్టు ఆయన వెల్లడించారు.