తెలంగాణ ప్రభుత్వంలోని ఏ శాఖలో చూసినా అవినీతిమయమైపోయిందని ఆరోపించారు చేశారు కాంగ్రెస్ కార్యకర్త బక్క జడ్సన్. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఓ వీడియోలో మాట్లాడుతూ.. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ సొసైటీలో జరిగిన అవకతవకలపై మాట్లాడారు. ఎగ్జిబిషన్ సొసైటీలో నెలకొన్న అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ యాంటీ కరెప్షన్ బ్యూరో ఏసీబీకి బక్క జడ్సన్ ఫిర్యాదు చేశానన్నారు.
విద్యాలయా కాలేజీ, కమలా నెహ్రూ పాటిటెక్నిక్ కాలేజీ, వెంకటేశ్వరా ఇంజనీరింగ్ కాలేజీల్లో అక్రమంగా ఫీజు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఈ కాలేజీలపై 2021 జూన్ 2న ఏసీబీ దాడులు కూడా జరిగాయన్నారు. ఆ కాలేజీల నుంచి పలు కీలక డాక్యుమెంట్స్ ని ఏసీబీ అధికారులు తీసుకున్నారని తెలిపారు.
విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులను.. సీఎం, పీఎం రిలీఫ్ ఫండ్ గా ఇచ్చారని విమర్శించారు. సొసైటీ ఎగ్జిబిషన్ లో అడుగడుగునా అక్రమాలు నెలకొన్నాయన్నారు.
నాంపల్లి ఎగ్జిబిన్ గ్రౌండ్ లో అక్రమగా నిర్మిస్తున్న బిల్డింగ్ పై కూడా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఫిర్యాదు చేశానన్నారు. వీటన్నింటిపైనా వెంటనే స్పందించాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు బక్క జడ్సన్.