మహిళా అధికారిణిని అసభ్యకర పదజాలంతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్. కాంగ్రెస్ బీసీ సెల్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
గతేడాది జులై 9న ఉప్పల్ గ్రామ సభలో మాట్లాడిన మంత్రి.. కమలాపురం మండలం మహిళా ఎంపీడీఓపై అసభ్యకర పదజాలంతో మాట్లాడారని గుర్తు చేశారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖాశర్మకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆ తర్వాత ఎర్రబెల్లిపై కేసు నమోదు కాగా.. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అగస్టు 9న వరంగల్ సీపీని మహిళా కమిషన్ ఆదేశించిందని తెలిపారు.
అయితే.. విచరణ కోరుతూ ఆదేశాలు జారీ చేసి 10 నెలలు కావస్తున్నప్పటికీ పోలీసులు రిపోర్ట్ పంపించారా? లేదా? అనే విషయం తెలియట్లేదని మండిపడ్డారు. దీనికి సంబంధించి ఆర్టీఐ ద్వారా తెలుసుకునేందుకు చూశామని.. ఎన్ని సార్లు అడిగినా విషయాన్ని వెల్లడించడం లేదని పేర్కొన్నారు.
Advertisements
మహిళా అధికారిణిపై ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జడ్సన్.