కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహకు తృటిలో ప్రమాదం తప్పింది. మెదక్ లో ఎద్దులబండిపై నుంచి ప్రసంగిస్తుండగా ఆయన కింద పడ్డారు.
పెట్రోల్ రేట్ల పెంపునకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మెదక్ లో జరిగిన కార్యక్రమంలో రాజనర్సింహ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ప్రసంగం చివరిలో కాంగ్రెస్ కీ జై అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఎద్దులు బెదిరిపోయి పక్కకు కదిలాయి. దీంతో రాజనర్సింహ కింద పడిపోయారు.
ఆయన పక్కనే ఉన్నవాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండాపోయింది. కాసేపటికి తేరుకున్న రాజనర్సింహ.. తర్వాత నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.