తెలంగాణ లో అధికారం కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అమిత్ షా కన్ను ప్రస్తుతం తెలంగాణ పై పడింది. 2023 ఎన్నికల్లో కేవలం ఉత్తర భారతదేశం పైనే ఆశలు పెట్టుకుంటే బీజేపీ అధికారంలోకి రావడం కష్టం. అందుకే సౌత్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆ ప్లాన్ లో భాగంగా సౌత్ లో కర్ణాటక తరువాత బీజేపీ బలపడే రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ లో పార్టీ బలం పెంచుకోవడానికి కాంగ్రెస్ టీఆరెఎస్ నేతలతో బీజేపీ టచ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. బీజేపీ బలం పెరిగే కొద్దీ కాంగ్రెస్ సొంత పార్టీ కుమ్ములాటల తో మరింత బలహీన పడే అవకాశం ఉంది.ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తొలి వెలుగు ఎన్ కౌంటర్ విత్ రఘు షో లో అంగీకరించారు.
మరో విశ్లేషణ కూడా చేశారు విశ్వేశ్వర్ రెడ్డి. ఒకవేళ బీజేపీ బలపడి కాంగ్రెస్ మరింత బలహీన పడితే, కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ , టీఆరెఎస్ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆ పరిస్థితే వస్తే నాలాంటి నాయకులంతా బీజేపీ లోకి లేదా వేరే పార్టీలోకి వెళ్ళడం ఖాయమన్నారు.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. క్షణం ముందు వరకు తిట్టుకున్న పార్టీలే పొత్తులకు సిద్ధపడుతున్న రోజులివి. ఇందుకు ఏ పార్టీ అతీతం కాదు.ఒకవేళ బీజేపీ రాష్ట్రంలో బలపడితే టీఆరెఎస్ బీజేపీ కలిసినా ఆశ్చర్యం లేదు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుత రాజకీయాలపై ఇంకా ఏం మాట్లాడారో కింది వీడియో లో చూడొచ్చు.