మల్లు రవి కాంగ్రెస్ నేత
తెలంగాణ ఏర్పడ్డనాటి నుంచి ముఖ్య మంత్రి కేసీఆర్ ఒక్క నిర్ణయం సక్రమంగా తీసుకోవడం లేదు.కేసీఆర్ యూ టర్న్ ముఖ్యమంత్రి. , ఈ ప్రభుత్వం పీచేమూడ్ పాలనగా తయారైంది. కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హమేలు ఒక్కటి అమలు చేయడం లేదు. ఇప్పుడు తీసుకున్న అన్ని నిర్ణయాలు వెనక్కు తీసుకుంటున్నారు.
నియంతృత వ్యవసాయ విధానం, ఎల్ ఆర్.ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకించిన పట్టించుకోకుండా మొండి వైఖరి అనుసరించిందని చివరకు ప్రజల పోరాటానికి తలొగ్గాల్సి వచ్చింది. ప్రజల తిరుగుబాటు వచ్చే సరికి ఇప్పుడు ఉద్యోగుల జీతాలు పెంచడం, వయో పరిమితి పెంచడం, ఉద్యోగాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి. ప్రజల నుంచి మరింత వ్యతిరేకత రాకముందే ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి.