ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి స్పందించారు. ఒకప్పుడు జైల్లో చిప్ప కూడు తిన్న నువ్వు నాపై ఆరోపణలు చేస్తావా అంటూ ఫైరయ్యారు. నేను కబ్జాలు చేస్తున్నది నిజం అయితే…10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి నా మీద ఆరోపణలు నిరూపించలేకపోయావా అంటూ మండిపడ్డారు. దోషులు ఎవరో బయట పడాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.