జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సే దేశ భక్తుడని నాగ బాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గాడ్సే మరణ వాంగ్మూలం చదివాను… బాధనిపించింది, గాంధీని చంపటం తప్ప గాడ్సేకు ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదంటూ నాగబాబు వ్యాఖ్యానించాడు. గాడ్సే నిజమైన దేశభక్తుడని, ఆయన దేశభక్తిని ఎవరూ శంకించలేరని స్పష్టం చేశాడు. ఇప్పుడే ఇదే విషయం పెను దుమారం రేపుతోంది. తాజాగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ నాగ బాబు పై ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యనున్నారు.