పోతిరెడ్డి పాడు ద్వారా సెంటిమెంట్ తో లాభపడి అధికారంలోకి వచ్చి అదే పోతిరెడ్డిపాడు తో కెసిఆర్ రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు . అధికారంలో ఉండి అధికార కాంగ్రెస్ ను ఎదిరించిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నాయకులది అన్నారు .పోతిరెడ్డి పాడు ఎత్తును పెంచుతానని జగన్మోహన్ రెడ్డి పలు సమావేశాల్లో , అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు.
జగన్ , కెసిఆర్ లోలోపల మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నారన్నారు . రెండు రోజుల క్రితం ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కెసిఆర్ కు చెప్పే చేశామని మీడియా ముఖంగా చెప్పారని, ఇదంతా జగన్ కెసిఆర్ కలిసి ఆడుతున్న నాటకమని మండిపడ్డారు . కెసిఆర్ న్యాయస్థానాలకు వెళ్తామని చెప్పినా తెలంగాణ జనం నమ్మరని అన్నారు. దక్షిణ తెలంగాణ ను ఎడారి చేసే కుట్రకు కెసిఆర్ తెరలేపారని మండిపడ్డారు . నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు . ఇది ఆరంభం మాత్రమే అన్నారు మర్రి శశిధర్ రెడ్డి .