డిసెంబర్ లో ఏపీ అసెంబ్లీలో పోతిరెడ్డిపాడు ఎత్తు పెంపు గురించి మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదు కెసిఆర్ అని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి దుమ్మెత్తి పోశారు . రోజా ఇంట్లో నాటు కోడి పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తావని చెప్పడం వెనుక కృష్ణా జలాలను తరలించే కుట్ర ఉందని , ఎవడబ్బ సొమ్మని ఇస్తావ్ కెసిఆర్ అని ప్రశ్నించారు .
కృష్ణా జలాలు మొత్తం రాయలసీమ కు తరలించే కుట్రకు జగన్ , కెసిఆర్ తెరలేపారని మండిపడ్డారు . ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా కెసిఆర్ కట్టలేదన్నారు . కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం దోచుకు తినడానికి మాత్రమేనన్నారు . దేవాదుల ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదన్నారు . బిడ్డా నీ భరతం పడతామని హెచ్చరించారు .తెలంగాణ రాష్ట్రానికి శనిలా దాపురించావన్నారు . బహిరంగ చర్చకు రావాలని కెసిఆర్ కు సవాల్ చేశారు నాగం జనార్దన్ రెడ్డి .