ఏయ్.... నిన్ను జైలుకు పంపే వరకు నిద్రపోను : నాగం - Tolivelugu

ఏయ్…. నిన్ను జైలుకు పంపే వరకు నిద్రపోను : నాగం

కెసిఆర్ ఆమోదంతో జగన్ పోతిరెడ్డి పాడు కెపాసిటీ పెంచుతూ 203 జీవో విడుదల చేసారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి . 120 టీఎంసీ ల కృష్ణా నీటిని ఎక్కువగా జగన్ తీసుకెళ్లారని విమర్శించారు . ఇదంతా కెసిఆర్ సహకారంతోనే జరిగిందన్నారు. తెలంగాణ కు రావాల్సిన వాటాను కూడా కెసిఆర్ వాడుకోలేకపోయారని నాగం అన్నారు . పాలమూరు రంగారెడ్డి మీద కేసు వేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ ను నీ సంకలోనే పెట్టుకున్నావని ఎద్దేవా చేశారు .

రాసి పెట్టుకో కెసిఆర్, నువ్వు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు . జగన్ , కెసిఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు . కృష్ణ నీటిని రాయలసీమకు తరలించే కుట్రకు ఈ ఇద్దరు సీఎంలు తెరలేపారన్నారు . కృష్ణా నీటి మీద దక్షిణ తెలంగాణ కు ఉండే హక్కును కాదనడానికి నువ్వు ఎవడివని ప్రశ్నించారు . ఖబడ్డారు కెసిఆర్ అంటూ రెచ్చిపోయారు నాగం .

Share on facebook
Share on twitter
Share on whatsapp