నూరుద్దీన్
కరోనా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఈ సమయంలో పరీక్షలు ఎందుకు ? 30 వేల కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ చేశారు. మిగతా పరీక్షలు రద్దు చేశారు. ఇప్పుడు ఎందుకు అలా ఆలోచించడం లేదు? రోజుకు 71 వేల కేసులు వస్తున్నాయి ? దూర ప్రాంత విద్యార్థులకు కరోనా పరీక్షలు చేసిన తర్వాత పరీక్షలకు అనుమతి ఇస్తారా ? లేదా సెల్ఫ్ సెంటర్ లు పెట్టి విద్యార్థులు అందరికీ పరీక్ష చేసిన తర్వాత పరీక్ష కు అనుమతి ఇస్తారా ? సీజనల్ వ్యాధులు వచ్ఛినవారిని కూడా కరోనా అని పరీక్ష కు అనుమతి ఇవ్వకపోతే ? సమ్మర్ లో జరగవలసిన తెలంగాణ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్ష, కరోనా వలన వాయిదా వేసారు ? కానీ ఇప్పుడు తెలంగాణ అన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విస్తరించింది? ఇప్పుడు దాకా ప్రాక్టీకల్ పరీక్షలు జరగలేదు ? ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్ లైన్ కాస్ల్ లు జరుగుతున్నాయి.
మరి అలాంటప్పుడు పరీక్షలు ఎలా నిర్వహించుతారు ? ఒక వేళ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే సెప్టెంబర్ నెల వచ్ఛింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు, సెట్ లు అన్ని రాసి కౌన్సెలింగ్ జరిగితే నవంబర్ లో ప్రారంభం అవుతుంది. మీరు ప్రగతి భవన్ దాటి రావడం లేదు. విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం ఇది ?
ఒక వేళ కరోనా వచ్ఛిన విద్యార్థుల కోసం మళ్ళీ పరిక్ష పెడతారా ? విద్యార్థులకు మానసికంగా ఆందోళన ఎక్కువ అవుతుంది. ప్రభుత్వాలు ఈ విషయం మీద ఆలోచించాలి. మాస్క్ వేసుకొని రెండు, మూడు గంటలు పరీక్ష రాయడం సాధ్యం కాదు , అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వం శానిటేషన్ ఇవ్వగలదా ? డాక్టర్ లకే పిపి కిట్ ఇవ్వని వారు అంత మంది ఉపాధ్యాయులకు ఇస్తుందా ?