పొన్నాల లక్ష్మయ్య
రాష్ట్రంలో వివాదాలు తలెత్తే సమయంలో తనేదో చేస్తున్నట్టు సుదీర్ఘ క్యాబినెట్ భేటీలు…సమీక్షలు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడన్నారు పొన్నాల లక్ష్మయ్య. 6 సంవత్సరాల పాలన కాలంలో మీరు చేపట్టిన ప్రాజెక్టుల పైన చర్చలేదు,ఇంతవరకు ఎక్కడైనా మరో కొత్త ప్రాజెక్టును ప్రారంభించారా అని ప్రశ్నించారు. గోదావరిలో మధ్యతరహా,చిన్నతరహా ప్రాజెక్టులు మొదలు పెట్టాము.
మా కాంగ్రెస్ హయాం,ఇలా అనేక ప్రాజెక్టులు మా పాలనా కాలంలో ప్రారంభించాం. హైద్రాబాద్ ప్రాంత ప్రజాల దాహార్తిని తీర్చడానికి ఎల్లంపల్లి నుంచి చేపట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టాము. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మేము ప్రారంభిస్తే ,కేసీఆర్ దాన్ని నిర్లక్ష్యం చేసాడు. ఎల్లం పల్లి నుండి మిడ్ మానేరు వరకు చేపట్టిన ప్రాజెక్టు 2 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. గత ఏడాది SRSP, ఎల్లంపల్లి వద్ద కు 108 టీఎంసీల నీళ్లు వస్తే, కేవలం 22 టీఎంసీల నీళ్లు మాత్రమే వాడుకుని, మిగిలిన 86 టీఎంసీల నీళ్లు వృధాగా వెళ్లి పోయాయి. కనీసం నికర జలాలు వాడుకోలేని మీరు ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపి మేమే సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఏం చేశారు.
దోపిడి కోణంలో తెచ్చిన 3 టీఎంసీల టెండర్లన్నీ వెంటనే రద్దు చేయాలి.
ఇప్పుడు 3టీఎంసీల ప్రాజెక్టు అప్రస్తుతం. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు. శ్రీ రాం సాగర్ నుండి LMD కి నీళ్లు పంపిస్తున్నాం అని కేసీఆర్ ఇప్పుడు చెబుతున్న, చెప్పుకునే పని ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ప్రాజెక్టుల పైన మాతో ప్రభుత్వం చర్చకు రావాలి. ప్రజలను నమ్మించడానికి అబద్దాలు చెబుతున్నారు. ఇది నీళ్ల పేరుతో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న మరో దోపిడీ కోణం ,
దేవాదుల ప్రాజెక్టులో కొత్తగా ఏ పనీ చేయలేదు,తట్టెడు మట్టి తీయలేదు కేసీఆర్ ప్రభుత్వం.
ఇది ప్రజల డబ్బులను నిరర్ధకం చేసేలా ప్రాజెక్టుల పేరుతో మోసం చేస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ కు పట్టిన మాయలపకీరని నవంబర్ నుండి మే వరకు ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోసారో అధికారికంగా లెక్కలు బయట పెడతారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఉన్న 2టీఎంసీల నీళ్లను వాడుకోలేని మీరు మరో టీఎంసీ గురుంచి డబ్బులు ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.