కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాల వల్ల చిన్న, సన్నకారు రైతులు కనుమరుగవుతారంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది.
ప్రధాని మోడీ అసుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల దగ్గర దొంగతనం ఆపండి మోడీ జీ అంటూ తెలుగులో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రాహుల్ తన తెలుగు ట్వీట్ లో… భారత దేశం బంద్ అని పౌరులందరికీ తెలుసని, మన్న అన్నదాత పోరాటానికి పూర్తిగా మద్దతిస్తూ విజయవంతం చేయండంటూ కోరారు.