దేశ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని ఆయన పేర్కొన్నారు. దానికి విరుగుడుగా కాంగ్రెస్ పార్టీ ప్రేమను పంచుతోందని రాహుల్ గాంధీ తెలిపారు.
ఈ నూతన సంవత్సరంలో ప్రతి వీధి, గ్రామం, నగరంలో ఓ ప్రేమ దుకాణం ఏర్పాటువుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర విశేషాలను ఆయన ఈ సందర్భంగా షేర్. మరోవైపు ప్రజలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కొత్త సంవత్సరం సందర్భంగా, ఆరోగ్యవంతమైన రాజస్థాన్, సర్వతోముఖాభివృద్ధి చేందే లక్ష్యంతో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా, సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. చత్తీస్ గఢ్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
జీవితంలో కొత్త ఆశలు, సకారాత్మక శక్తితో ఈ నూతన ఏడాదికి మనమంతా స్వాగతిద్దామని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వారణాసిలోని అస్సీ ఘాట్ వద్ద గంగానదికి భక్తులు హారతులు ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆలయంలో మహాశివునికి భస్మ హారతి ఇచ్చారు.