మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ రాజీనామపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అబద్ధాల పునాదులపై ఏర్పడ్డ ఫడణవీస్ ప్రభుత్వం పేకమేడలా కూలిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాల అన్నారు. ఇది దేవేంద్ర ఫడణవీస్ వైఫల్యం ఒక్కటే కాదని..ఢిల్లీలో ఉండి వారిని నడిపించిన ఆ పార్టీ నాయకులకు చెంప పెట్టని అన్నారు. వారి రాజీనామా ప్రజాస్వామ్య విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న వారి కుట్రలు ఫలించలేదన్నారు.