ఎమ్మార్వో విజయారెడ్డి మృతికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక మండల మేజిస్ట్రేట్ అయిన వ్యక్తిని పట్టపగలు పెట్రోల్ పోసి ఆఫీస్‌లోనే చంపే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రము లో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్ధం అవుతుందని విమర్శించారు మాజీ ఎంపీ రేణుకా చౌదరి. ఎమ్మార్వో విజయారెడ్డి మృతికి నివాళిగా ఖమ్మం డీసీసీ భవన్‌లో కొవ్వత్తులు వెలిగించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాటి మహిళా తమిళ సై రాష్ట్రపతి పాలనపై కేంద్రానికి నివేదిక పంపాలని కోరారు.