సీఎం కేసీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వికారాబాద్ కలెక్టరేట్ వద్ద రేవంత్ రెడ్డి ధర్నా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మా తాండూరు ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన దరిద్రుడు నువ్వే కదా?, 37 మంది ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసింది నువ్వే కదా? అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను ఖాళీ చేస్తే కేసీఆర్ కు ఆయన కొడుకుకు ఎదురే ఉండదని అనుకున్నారు.
కానీ ఆవు లాంటి పార్టీకి అన్యాయం చేస్తే ఆ పాపం ఊరికే పోతుందా అన్నారు. గతంలో నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. కనీసం నా బిడ్డ లగ్న పత్రికకు కూడా వెళ్లనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో వగలమారిన ఏడుపులు ఏడుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ నీ బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చింది. ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తుందా? అంటూ రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక నేను సీఎం అయినా కాకపోయినా .. కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రావాలని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎపుడైనా ఎన్నికలు రావొచ్చన్నారు రేవంత్. కేసీఆర్ ఎన్నికల కోసం తొందరపడుతున్నారు. కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. ఇక కేసీఆర్ ముందు డిమాండ్స్ పెట్టేది లేదన్నారు.
మా ఉసురు నీకు తగులుతుందని ఆయన మండిపడ్డారు. నీ పార్టీ చీలికలు పేలికలుగా పోతుందని ఆరోపించారు. కేసీఆర్ కి మా కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీలికలు తేలికలుగా టీఆర్ఎస్ మారిపోతుందన్నారు. ఇవన్నీ చూసి కేసీఆర్ కృంగి కుషించుపోతాడంటూ దుయ్యబట్టారు. ఎవరి ఇంటి ముందుకెళ్లి బిచ్చం అడగాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏలికలు, పేలికలుగా చీలుతుందని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి.