అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా వివాహ అర్హత వయసును 21 ఏళ్లకు పెంచాల్సిన అవసరముందంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారి తీశాయి. శివరాజ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత ఒకరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బాలికలు 15 ఏళ్లకే పిల్లలు కనగలరని డాక్టర్లు కూడా చెప్తోంటే.. ముఖ్యమంత్రి ఏ విషయాన్ని ఆధారంగా, అమ్మాయిల వివాహ అర్హత వయసును 18 నుంచి 21 పెంచాలని అనుకుంటున్నారో చెప్పాలని ఆ పార్టీ నేత సజ్జన్ సింగ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అలా చెప్పడానికి శివరాజ్ సింగ్ డాక్టరా లేక సైంటిస్టా అని విమర్శించారు. సజ్జన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
#WATCH | According to doctors, a girl is ready for reproduction by the age of 15. Is the CM a doctor or a scientist? So, on what basis does girls' marriage age should be increased to 21 from 18: Congress leader Sajjan Singh Verma in Bhopal pic.twitter.com/sVF1UyeLra
— ANI (@ANI) January 13, 2021
సజ్జన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను జాతీయ బాలల హక్కల పరిరక్షణ సంఘం ( National Commission For Protection of Child Rights) తీవ్రంగా పరిగణించింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై రెండో రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మైనర్ బాలికలపై ఏ ఉద్దేశ్యంతో అలాంటి మాటలు మాట్లాడారో, చట్ట వ్యతిరేఖ వ్యాఖ్యలు చేసారో చెప్పాలని నోటీసులో పేర్కొంది.
కాగా, ఇటీవల మహిళా భద్రతక సంబంధించిన ఓ కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో.. బాలికల వివాహ అర్హత వయస్సుపై శివరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిల పెళ్లికి కనీస అర్హత వయసు 21 సంవత్సరాలు అయినపుడు, అమ్మాయిల పెళ్లికి కనీస వయసు 18 సంవత్సరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలు చర్చించాల్సిన అవసరం ఎంతో ఉందని అభప్రాయపడ్డారు.