డాక్టర్ ఎన్. తులసి రెడ్డి
కాంగ్రెస్ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెప్పేవి అన్ని పచ్చి అబద్ధాలు. చెప్పిందే చేస్తా..చేసిందే చెప్తా.. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటా అంటూ ప్రగల్భాలు పలకడం తప్ప చేసేదేమి లేదు. ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన అంశాల్లోని 98.40 శాతం హామీలు నెరవేర్చా అని శుక్రవారం నర్సీపట్నం బహిరంగ సభలో చెప్పడం హాస్యాస్పదం
బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుంది జగన్ వాలకం. జగన్, అబద్దం కవల పిల్లలు. మేనిఫెస్టో లో పేర్కొన రైతులకు సంబంధించిన మొదటి అంశాన్నే నెరవేర్చలేదు. పంట వేసే సమయానికి మే నెలలో రూ.12500 లు ఇస్తాం. వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. గిట్టబాటు ధరకు గారంటీ ఇస్తాం. ప్రతి నియోజకవర్గంలో శీతలికరణ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్ కు రూ. 4 బోనస్ ఇస్తాం అని మేనిఫెస్టో లో పేర్కొన్నారు.
కానీ రూ.12500 లో రూ.5000 లు కోత పెట్టీ మిగిలిన దానిని మూడు దఫాలుగా ఇస్తున్నాడు. పావలా వడ్డీ పథకాన్ని పాడే కట్టాడు. సున్నా వడ్డీ పథకాన్ని సున్నం పెట్టాడు. గిట్టుబాటు ధర లభించక రైతులు పండిన పంటను పొలాల్లోనే పశువులకు వదిలేస్తున్నారుశీతలికరణ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సొంత నియజకవర్గం పులివెందుల లోనే ఏర్పాటు కాలేదు. పాడి రైతులకు రూ.4 లు కాదు కదా 4 పైసలు కూడా బోనస్ ఇవ్వలేదు
ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ అయ్యింది.విద్యా దీవెన పీజీ విద్యార్థుల పట్ల విద్యా శాపం అయ్యింది.25 లక్షల ఇళ్లకు గాను 25 వేల ఇల్లులు కూడా నిర్మించలేదు. నిధులు లేక జలయజ్ఞం నీరశించింది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. మహిళలకు ఇచ్చిన మద్యపాన నిషేధ హామీ నేరవేరక పోగా మద్యపాన నిషా పథకంగా తయారయ్యింది.
మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ దినచర్య. 98.40శాతం హామీలు నెరవేరలేదు.1.60 శాతం హామీలు మాత్రమే నెరవేరాయి. ఇది పచ్చి నిజం