తులసిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత
అమ్మకు అన్నం పెట్టని ప్రభుద్దుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుంది జగన్ ప్రభుత్వ వాలకం. ఒక్క రాజధానికే దిక్కు లేదు. 13 అదనపు జిల్లా కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించే ఆర్థిక శక్తి ఈ ప్రభుత్వానికి ఉందా?
కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర, అసందర్భ ప్రక్రియ. ఇది కందిరీగల తుట్టెను లేపి కుట్టించుకోవడమే. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగం తప్ప ప్రజలకు ఒరిగేదేం లేదు.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఎలక్ట్రానిక్ పాలన సాగుతున్న ఈ రోజుల్లో అదనపు జిల్లాలు అవసరమా? అంగన్వాడీ, ఆశా వర్కర్ల డిమాండ్లు తీర్చండి ముందు. వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.
అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం. వారి డిమాండ్లను తీర్చేదాకా వదిలిపెట్టం. ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం.