వైసీపీ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా తయారయ్యిందని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి. జగన్ పాలనలో రాష్ట్రం అత్యాచారాల ఆంధ్రప్రదేశ్ గా, నేరాంధ్రప్రదేశ్ గా తయారయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపల్లె రైల్వేస్టేషన్ లో భర్త కళ్లెదుటే మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేయడం సభ్య సమాజానికి సిగ్గు చేటని అన్నారు.
ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్న ఇంతవరకు ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. నేరాలు జరిగిన అనేక సందర్భాలలో నేరస్థులు మద్యం సేవించడం గానీ.. గంజాయి తదితర మత్తు పదార్థాల ప్రభావంతోనే నేరాలకు పాల్పడుతున్నట్టు రికార్డులు ఉన్నాయని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మత్తు పదార్థాలను అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఏ ఒక్క రోజు ప్రశ్న పత్రాలు లీక్ కాకపోయేటివని.. జగన్ పాలనలో ప్రశ్న పత్రాల లీక్ లతో విద్యార్ధుల జీవితాలను అందకారంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు.
బుధవారం పదోతరగతి తెలుగు ప్రశ్న పత్రం లీకయితే.. గురువారం హింది ప్రశ్న పత్రం, శుక్రవారం ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీకయ్యిందిని.. ఇలా వరసగా ప్రశ్న పత్రాలు లీకవుతుంటే.. విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నట్టని ప్రశ్పించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాష్ట్ర సీఎం, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తులసిరెడ్డి.