హైదరాబాద్ : రైతుబంధు పథకం కొండెక్కించారా.. అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రైతు బంధు పథకంలో అమల్లో జాప్యం జరుగుతోందని, ఇంతవరకు 40 శాతం మంది రైతులకు రైతు బంధు అమలు కాలేదని ఆ లేఖలో ఉత్తమ్ ఆరోపించారు. వెంటనే రైతు బంధు నిధులు బ్యాంకులలో జమ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉండటంతో రైతులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.
ఉత్తమ్ రాసిన బహిరంగ లేఖ మీకు యథాతధంగా అందిస్తున్నాం….