హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నేరుగా పార్టీ ఆఫీసుకు వెళ్లి జనసేనాని పవన్‌కల్యాణ్‌ని కలిసి ప్రశంసించడం దేనికి సంకేతం? ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం వైఖరితో అలిగినట్టు కనిపిస్తున్న వి. హనుమంతరావు ‘జనసేన’ సలహాదారుగా వెళ్తున్నారనే ప్రచారం వాస్తవమేనా? తాజాగా పవన్‌కల్యాణ్-వీహెచ్ జరిపిన భేటీ ఈ చర్చకు తావిచ్చింది. వీహెచ్-పవన్ సమావేశం మర్యాదపూర్వక సమావేశమేనని పైకి చెబుతున్నప్పటికీ, ఈ భేటీ సరికొత్త రాజకీయ సమీకరణలకు దారితీసేదని పరిశీలకులు భావిస్తున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పీసీసీ నియమించిన కమిటీకి అధ్యక్షునిగా వున్న వీహెచ్.. ఈ అంశంపై వివిధ రాజకీయ పక్షాలను కలిసే క్రమంలో మొదటగా జనసేనానిని కలిశారు. కాకపోతే, అక్కడ వీహెచ్ జనసేనానిని ప్రశంసలతో ముంచెత్తారు. యురేనియం తవ్వకాలపై ఫోకస్ పెట్టి పర్యావరణాన్ని కాపాడే కృషిలో తమకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంలోనే తమ పార్టీలో చేరి సలహాదారుగా వుండి నడిపించవలసిందిగా వీహెచ్‌ను పవన్‌కల్యాణ్ కోరారని ఒక లీక్!
Tolivelugu Latest Telugu Breaking News » Viral » సలహాదారుగా వీహెచ్!