గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. జాతీయ అగ్రనేతలంతా గ్రేటర్ లో ముమ్మరంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. గెలిచి తీరాలన్న కసితో బీజేపీ పావులు కదుపుతుంది.
మరోవైపు కాంగ్రెస్, టీఆర్ఎస్ ల అసంతృప్తి నేతలను బీజేపీ పార్టీలోకి జాయిన్ చేసుకుంటుంది. బల్దియా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేత విజయశాంతి బీజేపీ గూటికి చేరనున్నారు. ఆదివారం హైదరాబాద్ రానున్న కేంద్రమంత్రి అమిత్ షా ఆద్వర్యంలో ఆమె కషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
విజయశాంతి పార్టీలోకి వస్తే పార్టీకి మరింత ఊపు వచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ లో ఆమెను బుజ్జిగించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని, రాష్ట్ర నాయకత్వంపై ఆమె గుర్రుగా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.