రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నాలకు దిగారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్ కే పురం డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ లో నిరసన చేపట్టారు.
రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర అసోం సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు. వెంటనే ఆయన రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
క్రమశిక్షణ లేని ముఖ్యమంత్రిని బీజేపీ బర్తరఫ్ చేయాలని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్ యాదవ్ సహా పలువురు నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోమవారం అన్ని పోలీస్ స్టేషన్లలో హిమంత శర్మపై ఫిర్యాదులు చేయనుంది కాంగ్రెస్. ఈ మేరకు పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.