భారత్ బంద్ లో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా, పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ గుర్రపు బండిపై అసెంబ్లీకి వచ్చారు.
అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, జీవన్ రెడ్డి గుర్రపు బండిపై వచ్చారు. అయితే భద్రతా సిబ్బంది వారిని గేటు దగ్గరే అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. తమను లోపలకు పంపాల్సిందేనని కాంగ్రెస్ నేతలు వాదించారు.
కాంగ్రెస్ నేతలు ఎంత చెప్పినా పోలీసులు అనుమతి నిరాకరించారు. చేసేదిలేక అసెంబ్లీ గేటు దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు హస్తం పార్టీ నాయకులు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని నారాయణగూడ పీఎస్ కు తరలించారు పోలీసులు.