మీడియా లెజెండ్ రవి ప్రకాష్ అరెస్ట్ తరువాత చంచల్ గూడ జైల్లో రవిప్రకాశ్‌ని రేవంత్ రెడ్డి కలిసి సంఘీభావం తెలిపి, రవి ప్రకాశ్ అరెస్ట్ ని ఖండించారు . ఆర్టీసీ సమ్మెను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందన్నారు . జర్నలిజం పై దాడిగా అభివర్ణించారు . ప్రభుత్వం, వారి అనుచరులు మై హోమ్ రామేశ్వర్ రావు, మెఘా కృష్ణ రెడ్డి చెప్పినట్లుగా పోలీసులు జర్నలిస్టులపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
గత 5 సంవత్సరాలుగా మై హోమ్ , మెఘాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ మినహా కాంగ్రెస్‌లో ఇతర ఏ నాయకులు కూడా మై హోమ్ రామేశ్వర్ రావు ,మెఘా కృష్ణా రెడ్డిలను డైరెక్ట్ గా విమర్శించలేదు. కాంగ్రెస్ నాయకులు చాల మందికి మై హోమ్ , మేఘా తో సంబంధాలు ఉన్నాయన్నది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. ఏకంగా పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మై హోమ్ రామేశ్వర్ రావు కు ఉన్న సంబంధం ఎలాంటిదో అందరికి తెలుసని కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో టీఆరెస్ తో పాటు , చాల మంది కాంగ్రెస్ నాయకులకు ఫండింగ్ చేసింది ఈ ఇద్దరే అని అనేక విమర్శలు వినిపించాయి . మరి అలాంటప్పుడు సహజంగానే ఎలా విమర్శిస్తారు. అందుకు మంచి ఉదాహరణ హుజూర్ నగర్ ఉపఎన్నిక . హుజూర్ నగర్ లో ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి , మై హోమ్ రామేశ్వర్ రావు ను విమర్శించింది లేదు . మిగతా విపక్ష అభ్యర్థులు మై హోమ్ టార్గెట్ గా ప్రచారం చేస్తుండటం గమనార్హం. అందుకే మై హోమ్ , మెఘాను వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డిని కొందరు కాంగ్రెస్ నాయకులూ విమర్శించడం, రాజకీయంగా కుట్రలు చేస్తున్నారు అంటున్నారు రేవంత్ అనుచరులు. ఇక మనకెందుకులే అనుకుంటు… చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఈ విషయంపై స్పందించడానికి భయపడుతున్నారు .
రేవంత్ రెడ్డికి పీసీసీ రాకుండా అడ్డుపడుతున్నది, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్‌ను తప్పుబడుతూ… ఉత్తమ్‌కు బాసటగా నిలిచారని రేవంత్ అభిమానులు తొలివెలుగుతో వాఖ్యానించారు. మైహోమ్, మెఘాలతో లబ్ధిపొందే కాంగ్రెస్ నాయకులు డిల్లీ కేంద్రంగా కూడా తమ నాయకున్ని అణగదొక్కే కార్యక్రమం చేపడుతున్నారు.