మహారాష్ట్ర రాజకీయం పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించింది. లోక్ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మహారాష్ట్ర రాజకీయంపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పొడియం ను చుట్టుముట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడాన్ని కూడా అడ్డుకుంటుందన్నారు. బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఎన్ని సార్లు చెప్పినా సభ్యులు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే సీన్ జరిగింది. కాంగ్రెస్ సభ్యులు బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.