కాంగ్రెస్ కు నమ్మిన బంటులం… గాంధీ కుటుంబానికి వీర విధేయులం… పార్టీకి సేవలకులం అంటూ కాంగ్రెస్ సీనియర్లు పదే పదే చెప్పే మాట. కానీ గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ లో ఇప్పుడు పీసీసీ పోస్ట్ రేసు జోరుగా సాగుతుంది. ఈ రేసులో ముందుండాలన్న తపనతో కాదు తమకు ఇష్టం లేని నేతకు పదవి ఇవ్వొద్దనే తొందరలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నాయకుడు రాహుల్ గాంధీనే చంపేశారు.
అవును… రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ సీనియర్లు కొందరు ఏఐసీసీ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి రెండు పేజీల లేఖ రాశారు. అందులో తమను తాము గొప్పగా చెప్పుకునే ప్రయత్నంలో గతంలో జరిగిన విషయాలు చెప్పుకుంటూ… రాహుల్ గాంధీని మరణించిన వారికి సంబోధించే Late Rahul Gandhi అంటూ పేర్కొన్నారు.
దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తాను ఏం చేస్తానో చెప్పుకొని పదవి పొందాలి కానీ ఇలా ఇతరులపై బురద జల్లే కార్యక్రమం వల్లే పార్టీ గతి ఇలా తయారైందని, ఇప్పుడు సదరు సీనియర్లకు రాహుల్ కు రాజీవ్ కు కూడా తేడా తెలియకుండా పోయిందని మండిపడుతున్నారు. మీ ఈ గ్రూప్ రాజకీయాల వల్లే ఇలా నాశనం అవుతున్నాం అంటూ మండిపడుతున్నారు.