కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అలకబూనారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై ని కలిసే కార్యక్రమంలో తమ పేరు లేనందుకు అలిగి నేతలు గాంధీ భవన్ నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఈరోజు గవర్నర్ తమిళసై ని కలిసి మహిళలపై దాడి, మద్యం నియంత్రణ, బెల్టు షాపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీని కోసం సీనియర్ నేతలు హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య గాంధీభవన్ కు వచ్చారు. వారి పేర్లు గవర్నర్ కలిసే నేతల జాబితాలో లేవు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫోన్ చేస్తేనే తాము వచ్చామని..కానీ జాబితాలో పేరు లేదని వీహెచ్ అన్నారు. ఇది తమకు అవమానకరమన్నారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు ఉన్నారు