గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి కాంగ్రెస్ బృందం బయల్దేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో షబ్బీర్ అలీ, మల్లు రవి పోలీసులత వాగ్వాదానికి దిగారు. దీంతో కొత్త సచివాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు నూతన సెక్రటరీయేట్ వద్ద మోహరించారు.
కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ..కాంగ్రెస్ పార్టీ జోహర్లు అంటూ నినాదాలు చేశారు. మేము శాంతియుతంగా సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం విషయం గురించి నిజనిర్ధారణ చేద్దామంటే గాంధీ భవన్ గేట్ల వద్దే పోలీసులు ఆపేశారంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గవర్నమెంట్ అంతా అది మాక్ డ్రిల్ అని అబద్ధాలు చెబుతుందని షబ్బీర్ అలీ అన్నారు.
అధికారులు చెబుతున్నట్లు అది మాక్ డ్రిల్ అయితే మేము కూడా మీడియా ముందు అదే చెబుతాం కదా. కానీ పోలీసు అధికారులు మాత్రం మమ్మల్ని అసలు లోనికి పోనియ్యడం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం సచివాలయంలో అధికారులు ఎవరు లేరు. అయినప్పటికీ మమ్మల్ని ఎందుకు లోనికి పోనియ్యడం లేదు.
అసలు లోపల పరిస్థితి ఎలా ఉంది.. మంటలను ఎలా అదుపు చేస్తున్నారు అనే విషయాలను దగ్గర ఉండి చూస్తామనే కదా మేము చెప్తున్నాం. కానీ ఎందుకు మమ్మల్ని లోపలికి పోనియ్యడం లేదని నేతలు ప్రశ్నిస్తున్నారు.