ఉస్మానియ యూనివర్సిటీ లో నిర్వహించే రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఓయు పరిశోదక విద్యార్థి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో.. ఓయూ వీసీ, రిజిస్టార్ ని పార్టీ నేతలు కలిశారు. పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావుతోపాటు.. మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు వీసీని కలిశారు.
రాహుల్ గాంధీ పర్యటన విద్యార్థుల భవిష్యత్తుతో ముడి పడి ఉందని అన్నారు. దయచేసి టీఆర్ఎస్ పార్టీ అంటకం కలిగించొద్దని అన్నారు వీహెచ్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబానికి చెందిన వ్యక్తి రాష్ట్రానికి వస్తే ఆహ్వానించాలే తప్ప.. అవమానించోద్దని అన్నారు.
యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు చనగాని దయాకర్ వీసీ అనుమతికి సహకరించాలని కోరారు. ఓయూ విద్యార్ధులు చెసిన త్యాగాల కారణంగానే కేసీఆర్ సీఎం అవ్వగలిగారని అన్నారు.
రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇచ్చి.. స్వాగతించాలని ఓయూ వీసీని కోరారు. ఓయూ వేదికగా జరిగిన ఉద్యమాల కారణంగా రాష్ట్రం ఏర్పండిదనే విషయాన్ని గుర్తుచేసుకున్నారు హనుమంతరావు.