2024 జాతీయ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఈ మేరకు ఇతర విపక్ష పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమిదే విజయమన్నారు.
ప్రధాని మోడీ, అమిత్ షా లాంటి వారు వంద మంది వచ్చినా తమ విజయాన్ని అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలే బుద్ది చెబుతారని ఆయన పేర్కొన్నారు. నాగాలాండ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు…
రాబోయే రోజుల్లో బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేకుండా పోతుందన్నారు. దేశాన్ని ఎదుర్కొనే ఏకైక వ్యక్తిని తానేనని ప్రధాని చెప్పుకుంటున్నారని ఆయన తెలిపారు.
ఇతర వ్యక్తులెవరూ తనను తాకలేరంటూ ప్రధాని అంటున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులెవరూ అలా మాట్లాడరన్నారు. ప్రధాని మోడీ కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నారని, ఆయన్ని ప్రజలు ఎన్నుకున్నారన్నారు. ఆయనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతురన్నారు.