హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి దిశగా ప్రయాణిస్తోంది. పీసీసీ చీఫ్ కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్ ఇప్పుడు టీఆర్ఎస్ వశం అవుతున్నట్లుగా కనపడుతోంది.ఓవైపు ఆర్టీసీ సమ్మె, ఇతర ప్రజా సమస్యలేవి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు ఓట్ల వర్షం కురిపించలేకపోయాయి. ఓవైపు ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వంపై ప్రజల్లో నిరసన ఉన్నప్పటికీ, టీఆర్ఎస్‌కు నెగెటివ్ కాకపోవటం గమనార్హం. అయితే, ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవటం, భారీగా ఇండిపెండేంట్లు ఓట్లు చీలుస్తుండటం కూడా కాంగ్రెస్ పార్టీని ఓటమి అంచుకు నెట్టివేస్తున్నట్లు కనపడుతోన్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్‌కు, ఉత్తమ్‌కు కంచుకోటగా ఉన్న నేరేడుచర్ల, పాలకవీడు మండలాలు టీఆర్ఎస్‌కు భారీ ఆధిక్యతను ఇచ్చిన నేపథ్యంలో, పట్టణ ప్రాంతాల్లో ఓట్ల మీదే కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నట్లు కనపడుతోంది.