మధుయాష్కీ గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్
క్విట్ ఇండియా ఉద్యమం రోజు ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా జరుగుతుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, విద్యా, ఉద్యోగాలు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ.. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యింది. కేసీఆర్ నయా నిజాం లాగా పాలన సాగిస్తున్నారు. ఆయన అరాచక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా.
కేసీఆర్ ఎన్నికల్లో దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి ఉంటే వారు ఆత్మగౌరవంతో ఉండేవారు. ముడెకరాల భూమి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల కోసం దళిత బంధు పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారు. ఉద్యోగాలు ఇచ్చి ఉంటే .. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా ఆత్మగౌరవంతో బతికేవారు. అప్పుడు.. నువ్విచ్చే రూ.10 లక్షలు వాళ్లకు అవసరమే లేదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాష్ట్ర సంపదతో కేసీఆర్ విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకున్నారు. రాజ్యాంగం ప్రకారం వారికి వచ్చే హక్కులు అమలు అయితే వారు ఆత్మగౌరవంతో ఉండేవారు. దళిత, గిరిజనుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చినా తక్కువే. హుజూరాబాద్ ఎన్నికల కోసం మళ్లీ మోసాలకు తెర లేపారు సీఎం. ఇంద్రవెల్లి సభకు రాజకీయాలకి అతీతంగా అందరూ తరలిరావాలి. ప్రజల స్పందన చూస్తుంటే.. లక్షకు పైగా జనం వస్తారని అంచనా.